సంగక్కర బాటలో జయర్థనే

17 Mar, 2014 13:56 IST|Sakshi
సంగక్కర బాటలో జయర్థనే

ఢాకా: శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం మహేల జయవర్థనే అంతర్జాతీయ టి20లకు గుడ్ బై చెప్పనున్నాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి అతడు వైదొలగుతాడని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ట్విటర్ ద్వారా వెల్లడించింది. కుమార సంగక్కర బాటలోనే జయవర్థనే పయనించనున్నాడని తెలిపింది. ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ కానున్నట్లు సంగక్కర నిన్న ప్రకటించాడు.

36 ఏళ్ల జయవర్థనే వరుసగా ఐదు టి20 ప్రపంచకప్‌లలోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 49 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన జయవర్థనే.. 31.78 సగటు, 134 స్ట్రైక్ రేట్‌తో 1335 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఎనిమిది అర్థ సెంచరీలున్నాయి.

మరిన్ని వార్తలు