సాకర్‌లోనూ ధోని హవా

28 Sep, 2013 01:01 IST|Sakshi

రాంచీ: చాంపియన్స్ లీగ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోని.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. శుక్రవారం జరిగిన స్నేహపూరిత మ్యాచ్‌లో ఒక గోల్ చేశాడు. తన స్నేహితుడు, జార్ఖండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మహతో అసెంబ్లీ నియోజకవర్గం సిలిలో ఈ మ్యాచ్ జరిగింది. ధోని, మహతోల టీమ్ 4-1తో స్థానిక సాకర్ అకాడమీపై విజయం సాధించింది. ధోని ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలని అతని అభిమానులు కోరుకుంటారని ఈ సందర్భంగా మహతో అన్నారు. దీనికి స్పందించిన మహీ... కొంతకాలం వేచి చూడాలని సమాధానమిచ్చాడు. మ్యాచ్ సందర్భంగా స్టేడియం కిక్కిరిసిపోయింది.
 
 ధోని, ధావన్‌లకు జరిమానా
 రాంచీ: స్లో ఓవర్ రేట్ కారణంగా చెన్నై, సన్‌రైజర్స్ జట్ల కెప్టెన్లతో పాటు ఆటగాళ్లపై కూడా జరిమానా పడింది. సీఎల్‌టి20లో భాగంగా గురువారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నిర్ణీత సమయంకంటే చాలా ఆలస్యంగా ముగిసింది. దీనిని తొలి తప్పిదంగా గుర్తిస్తూ సీఎల్‌టి20 నిబంధనల ప్రకారం ధోని, ధావన్‌లకు చెరో 1500 డాలర్లు (దాదాపు రూ. 94 వేలు) చొప్పున, ఇరు జట్ల సభ్యులకు ఒక్కొక్కరికి 750 డాలర్ల (దాదాపు రూ. 47 వేలు) చొప్పున జరిమానా విధించారు.
 

మరిన్ని వార్తలు