'ధోనికి కఠిన పరీక్షే'

15 Oct, 2016 12:41 IST|Sakshi
'ధోనికి కఠిన పరీక్షే'

న్యూఢిల్లీ:న్యూజిలాండ్తో రేపట్నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్లో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కఠిన పరీక్ష ఎదురుకానుందని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తన టెస్టు క్రికెట్ కెరీర్ కు దూరమైన ధోనికి అంతర్జాతీయ మ్యాచ్లను అతి తక్కువగా ఆడుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ తో సిరీస్ కచ్చితంగా క్లిషమైనదేనని పేర్కొన్నాడు. ధోని నిలకడైన అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేని కారణంగా కివీస్తో సిరీస్లో తన పూర్వవైభవాన్ని చాటుకోవడానికి కష్టపడక తప్పదన్నాడు.  ప్రస్తుతం 35 ఏళ్ల ధోని నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశించడం కూడా అత్యాశే అవుతుందన్నాడు.

'గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్ ను చూడండి. అతను అంతర్జాతీయంగా ఎన్నో ఘనతలు సాధించాడు. అయినప్పటికీ వుడ్ వయసు పైబడిన కొద్దీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ప్రత్యేకంగా 30 ఏళ్ల వయసులో వుడ్ తన సత్తాను చాటుకోవడానికి చాలా కష్టించాడు. ఏ అథ్లెట్ అయినా 30 ఏళ్లు దాటితో తిరిగి పుంజుకోవడం అంత సులభం కాదు' అని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా, వన్డే సిరీస్ కు భారత జట్టు నుంచి మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, అశ్విన్ లాంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం న్యూజిలాండ్ కు కలిసొచ్చే అవకాశం ఉందని గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నాడు.

మరిన్ని వార్తలు