'ధోని ఆటతీరును పరిశీలించండి'

10 Oct, 2015 17:07 IST|Sakshi
'ధోని ఆటతీరును పరిశీలించండి'

ముంబై: టీమిండియా జట్టులో విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని ఆట తీరుపై మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన అనంతరం ధోని కెప్టెన్సీని, ఆట తీరును తప్పుబట్టిన అగార్కర్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.  ధోని ఆటతీరును సెలెక్టర్లు సునితంగా పరిశీలించాల్సిన సమయం వచ్చేసిందటూ ఈ మాజీ టీమిండియా ఆటగాడు పేర్కొన్నాడు. టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి సత్తాను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ధోని భవిష్యత్తుపై సెలెక్టర్లు ఒక నిర్ణయానికి రాగలరని తాను భావిస్తున్నట్లు తెలిపాడు.  దీనికి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్ నే దృష్టిలో పెట్టుకోవాలని సెలెక్టర్లకు సూచించాడు.
 
కెప్టెన్‌గా, ఆటగాడిగా ధోని మంచి రికార్డే ఉండవొచ్చు. అతని బాధ్యతను జట్టే తీసుకునే పరిస్థితి రావొద్దు. పూర్వపు స్థాయిని గుర్తుచేస్తున్నట్టుగా ఆడాలి తప్ప.. తాను విఫలమవుతున్నా ఫర్వాలేదు అనిపించకూడదు' అని అగార్కర్ పేర్కొన్నాడు. వచ్చే వరల్డ్‌కప్ కోసం పటిష్ట జట్టును తయారుచేసుకోవాలని అగార్కర్ అన్నాడు. జట్టులో ఫాస్ట్ బౌలర్ అవసరం లేకపోయినా.. ఒక మంచి బౌలర్ కావాలన్న సంగతిని ధోని గుర్తుంచుకోవాలన్నాడు.

ట్వంటీ 20 సిరీస్ కంటే వన్డే జట్టు ఎంపిక చాలా బాగుందని తెలిపాడు. ఎప్పట్నుంచో టీమిండియా క్రికెట్ జట్టులో శాశ్వత సభ్యుడిగా ఉన్న పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ ను ట్వంటీ 20 ల్లో ఎందుకు పక్కకు పెట్టారంటూ ప్రశ్నించాడు. వన్డేల్లో ఉమేష్ ను ఎంపికచేయడంపై బౌలింగ్ బలంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.

మరిన్ని వార్తలు