స్టీపుల్‌చేజ్‌ విజేత మహేశ్వరి

16 Sep, 2019 10:11 IST|Sakshi

 సౌత్‌జోన్‌ జాతీయ అథ్లెటిక్స్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ జాతీయ అథ్లెటిక్స్‌ టోర్నీలో జి. మహేశ్వరి రికార్డు స్వర్ణాన్ని సాధించింది. కర్ణాటకలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహేశ్వరి 2000మీ. స్టీపుల్‌ చేజ్‌లో కొత్త జాతీయ రికార్డుతో పాటు, మీట్‌ రికార్డును నెలకొల్పింది. ఆమె 6 నిమిషాల 41 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని... 2015లో నమోదైన 7ని. 1.72 సెకన్లతో ఉన్న జాతీయ రికార్డును తిరగరాసింది. 200మీ. పరుగులోనూ దీప్తి మీట్‌ రికార్డును సాధిం చింది. పరుగును 24.84సెకన్లలో ముగించి స్వర్ణాన్ని గెలుచుకుంది.

దీంతో అన్సీ జోసెఫ్‌ (25.09సె.) రికార్డు తెరమరుగైంది. హెప్టాథ్లాన్‌లోనూ నూతన జాతీయ రికార్డు నమోదైంది. నందిని 5046 పాయింట్లు సాధించి జాతీయ రికార్డుతో పాటు మీట్‌ రికార్డును సృష్టించింది. గతంలో ఈ రికార్డు స్వప్నా బర్మన్‌  4992 పాయింట్లు) పేరిట ఉండేది. ఈ టోరీ్నలో తెలంగాణ 7 స్వర్ణాలు, 14 రజతాలు, 12 కాంస్యాలు సాధించింది.   

మరిన్ని వార్తలు