మలింగ, హెరాత్‌లకు విశ్రాంతి

23 Oct, 2014 00:40 IST|Sakshi

భారత్‌తో తొలి మూడు వన్డేలకు లంక జట్టు ప్రకటన
 
కొలంబో: భారత్‌తో వన్డే సిరీస్‌లో శ్రీలంక నలుగురు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. నవంబరు 2 నుంచి జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల కోసం లంక జట్టును ప్రకటించారు. స్టార్ పేసర్ మలింగతో పాటు ప్రధాన స్పిన్నర్ హెరాత్‌కూ విశ్రాంతి ఇచ్చారు. అలాగే మిడిలార్డర్‌లో కీలక బ్యాట్స్‌మెన్ తిరిమన్నె, చండీమల్‌లను తప్పించారు. అయితే ఈ ఆకస్మిక సిరీస్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగక్కర కూడా భారత్‌కు రావడం అనుమానంగానే ఉంది. జయసూర్య సారథ్యంలోని సెలక్టర్ల బృందం ప్రకటించిన జట్టులో సంగక్కర ఉన్నా... తను వెన్నునొప్పితో బాధపడుతున్నాడని సమాచారం. సంగక్కరతో పాటు తిషార పెరీరా కూడా గాయం కారణంగా భారత్‌కు రాకపోవచ్చు. పేసర్ గమాగేను తొలిసారి జట్టులోకి ఎంపిక చేశారు.

తొలి మూడు వన్డేలకు శ్రీలంక జట్టు: మాథ్యూస్ (కెప్టెన్), దిల్షాన్, కుశాల్ పెరీరా, తరంగ, సంగక్కర, జయవర్ధనే, ప్రియాంజన్, డిక్‌వెల్లా, తిషార పెరీరా, కులశేఖర, దమ్మిక ప్రసాద్, గమాగే, చతురంగ డిసిల్వ, ప్రసన్న, రణ్‌దివ్.
 

మరిన్ని వార్తలు