మలింగ మాయ.. లంక ఉత్కంఠ విజయం

25 Feb, 2014 22:50 IST|Sakshi
మలింగ మాయ.. లంక ఉత్కంఠ విజయం

మిర్పూర్: ఆసియా కప్ లో శ్రీలంక శుభారంభం చేసింది. పాకిస్థాన్ తో మంగళవారం హోరీహోరీగా జరిగిన మ్యాచ్ లో లంక 12 పరుగులతో ఉత్కంఠ విజయం సాధించింది. తిరుమన్నె (102) సెంచరీతో పాటు మలింగ (5/52) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాక్ కు ఓటమి తప్పలేదు.

297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మరో ఏడు బంతులు మిగిలుండగా 284 పరుగులకు కుప్పకూలింది. పాక్ కెప్టెన్ మిస్బా (73), ఉమర్ అక్మల్ (74) హాఫ్ సెంచరీలతో రాణించగా, ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. పాక్ ఓ దశలో 252/5 స్కోరుతో విజయం దిశగా పయనించినా.. మలింగ చివర్లో వరుసగా ఐదు వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు.

  అంతకుముందు టాస్ గెలిచి ముందుగా  బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. తిరుమన్నె అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 110 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్తో 102 పరుగులు చేశాడు. సంగక్కర(67), మాథ్యూస్(55) అర్థ సెంచరీలు చేశారు. పెరీరా 14, జయవర్థనే 13, చందిమాల్ 19 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో ఉమర్ గుల్, షాహిద్  ఆఫ్రిది రెండేసి వికెట్లు పడగొట్టారు. సయీద్ అజ్మాల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

మరిన్ని వార్తలు