డబుల్స్‌ ఫైనల్లో మనీషా ద్వయం

24 Sep, 2017 01:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలిష్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి కె. మనీషా భారత్‌కే చెందిన తన భాగస్వామి ఆరతి సారా సునీల్‌తో కలిసి ఫైనల్లోకి ప్రవేశించింది. పోలాండ్‌లోని బీరన్‌ నగరంలో శనివారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో మనీషా–ఆరతి జోడీ 21–12, 21–13తో కార్నెలియా మార్క్‌జాక్‌–మగ్దలీనా విటెక్‌ (పోలాండ్‌) జంటపై విజయం సాధించింది.

మరిన్ని వార్తలు