మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

23 Jul, 2019 10:02 IST|Sakshi

జేఈ విల్సన్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ సిరీస్‌  

సాక్షి, హైదరాబాద్‌: జేఈ విల్సన్‌ ఘనా ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ సిరీస్‌లో తెలుగు అమ్మాయి మనీషా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణతో కలిసి చాంపియన్‌గా నిలిచిన మనీషా... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అర్జున్‌తో కలిసి రన్నరప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఘనాలోని అక్రా వేదికగా జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో మనీషా–రుతుపర్ణ (భారత్‌) ద్వయం 21–11, 21–11తో డోర్‌కస్‌ అజోకే అడ్సోకన్‌–చెచువు డెబోరా ఉకెహ్‌ (నైజీరియా) జంటపై అలవోక విజయాన్ని సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ పోరులో టాప్‌ సీడ్‌గా బరిలో దిగిన మనీషా–అర్జున్‌ (భారత్‌) జంట 19–21, 15–21తో శ్లోక్‌–రుతుపర్ణ (భారత్‌) జోడీ చేతిలో కంగుతింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ అర్జున్‌–శ్లోక్‌ (భారత్‌) జోడీ 21–11, 21–12తో గోడ్విన్‌ ఓలోఫువా–అనౌలువాపో జువోన్‌ ఒపెయోరి (నైజీరియా) జంటపై నెగ్గింది.

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో కిరణ్‌ జార్జ్‌ (భారత్‌) 25–23, 21–19తో అడె రెస్కీ వికాయో (అజర్‌బైజాన్‌)ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ ముగ్ధా ఆగ్రే (భారత్‌) 10–21, 6–21తో థి త్రాంగ్‌ వు (వియత్నాం) చేతిలో ఓడిపోయి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తొలిసారి జరిగిన ఈ టోర్నీలో భారత్‌ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలను సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్‌ నియామకాలు

ఆ మ్యాచ్‌ తర్వాత వన్డేలకు మలింగ గుడ్‌బై

మనోళ్ల సత్తాకు పరీక్ష 

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పంజా

శ్రీజ తీన్‌మార్‌

టోక్యో ఎంత దూరం?

యు ముంబా చిత్తుచిత్తుగా

బీసీసీఐలో భగ్గుమన్న విభేదాలు

సైన్యంలోకి ధోని.. మాజీ క్రికెటర్‌ ఎగతాళి

‘ఆ క్రెడిట్‌ అంతా గంభీర్‌దే’

‘రిటైర్‌ అవ్వను.. అందుబాటులో ఉండను’

‘ఇక పాక్‌ క్రికెట్‌ జట్టును నేను సెట్‌ చేస్తా’

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ఓడితే బ్యాట్‌ పట్టుకునే వాడిని కాదు: ఇంగ్లండ్‌ క్రికెటర్‌

సచిన్‌ సూచనకు ఓటేసిన బౌలింగ్‌ కోచ్‌

కేదార్‌ జాదవ్‌ ఎందుకు బాస్‌?

ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర!

శుబ్‌మన్‌ గిల్‌ టాప్‌ లేపాడు..

సలామ్‌ బాస్‌: రిషభ్‌

శ్రీశ్వాన్‌కు ఐఎం హోదా

విజేతలు సచిన్, ప్రహర్షిత

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

రన్నరప్‌తో సరి

శ్రీజ తడాఖా

నాది నిర్ణయలోపమే

క్వార్టర్స్‌లో నిఖత్‌

రాయుడిపై వివక్ష లేదు

విండీస్‌ సిరీస్‌కు సై

నచ్చారండి.. హిమదాస్‌

నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?