మనోజ్‌ తివారీ 303 నాటౌట్‌

21 Jan, 2020 08:36 IST|Sakshi

కోల్‌కతా: హైదరాబాద్‌తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్‌ బ్యాట్స్‌మన్‌ మనోజ్‌ తివారీ ట్రిపుల్‌ సెంచరీతో సత్తా చాటాడు. మనోజ్‌ తివారీ (414 బంతుల్లో 303 నాటౌట్‌; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌ను బెంగాల్‌ 7 వికెట్లకు 635 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అతని ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో ఇది 27వ సెంచరీ కాగా, తొలి ‘ట్రిపుల్‌’ కావడం విశేషం. బెంగాల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా