కంగనాకు బాసటగా బెంగాల్‌ బ్యాట్స్‌మన్‌

22 Jul, 2020 18:27 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యపై గ‌త కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో తీవ్రస్థాయిలో వివాదాలు నెల‌కొంటున్నాయి. ఇండ‌స్ట్రీలోని నెపోటిజం కార‌ణంగానే సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బాలీవుడ్‌ క్వీన్‌ కంగ‌నా ర‌నౌత్ చేసిన వ్యాఖ్య‌ల అనంత‌రం ఈ వివాదం మరింత ముదిరింది. ఆమె ​వ్యాఖ్యలను పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఖండిస్తుండ‌గా మ‌రికొంద‌రు ఆమెకు మ‌ద్ద‌తునిస్తున్నారు. తాజాగా ఆమెకు మ‌ద్ద‌తు ప‌లికే వారిలో బెంగాల్ క్రికెట‌ర్ కూడా చేరాడు. బ్యాట్స్‌మన్‌ మ‌నోజ్ కుమార్‌ తివారి ట్విట‌ర్ వేదిక‌గా కంగనాకు మద్దతు నిచ్చాడు. బుధవారం ట్వీట్‌ చేస్తూ.. ‘భారతదేశం సుశాంత్ మృతికి కారణం తెలుసుకోవాల‌ని అనుకుంటోందని పేర్కొన్నాడు. (చదవండి: ‘నటించమని ఎవరూ బెదిరించలేదు కదా’)

‘సుశాంత్‌ మృతిపై కంగ‌నా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ప్ర‌తి ఒక్క‌రూ ఆమెపై దాడి చేస్తున్నారు. అయితే అందరూ ఒక్క విష‌యం గుర్తుంచుకోవాల‌ని. మ‌నం చేసిన క‌ర్మ ఎప్ప‌టికైనా తిరిగి మ‌న వ‌ద్ద‌కే వ‌చ్చి చేరుతుంది’ అంటూ #IndiaWantsSushantTruth అనే హ్య‌ష్ ట్యాగ్‌ను జత చేశాడు. మరో ట్వీట్‌లో ‘‘త‌న‌పై దాడి చేసే వారిపై కంగనా పోరాటం ఎప్ప‌టికీ కొన‌సాగుతుంది. ఇత‌ర విష‌యాల‌పైకి మ‌ళ్ళ‌కుండా కంగనా ఇలాగే పోరాటం కొన‌సాగించాలని ఆశిస్తున్నా. కంగ‌నా దీనిపై నోరు విప్పినందుకే ఆమెపై దాడులు జ‌రుగుతున్నాయ‌ని అయితే ఆమెకు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే నోరు మూసుకుంటారా’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అంతకు ముందు కూడా తివారి, సుశాంత్ ఫొటోని షేర్ చేస్తూ ‘‘చివరికి శత్రువు మాటలను కాదు, స్నేహితుల నిశ్శబ్దాన్ని గుర్తుంచుకుంటాం’’ అంటూ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాట‌ల‌ను ఉటంకించాడు. (చదవండి: కంగనాకు స‌మీర్ సోని కౌంటర్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా