మన్‌ప్రీత్, శ్రీజేష్‌లకు విశ్రాంతి

26 Jul, 2019 10:00 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ టెస్ట్‌ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టు ప్రకటన  

న్యూఢిల్లీ: రెగ్యులర్‌ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్, మాజీ కెప్టెన్, గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌లకు విశ్రాంతి కల్పిస్తూ... ఆగస్టు 17 నుంచి 21 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్‌ టెస్ట్‌ ఈవెంట్‌లో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత హాకీ జట్టును హాకీ ఇండియా గురువారం ప్రకటించింది. డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌కు తాత్కాలిక సారథ్య బాధ్యతలను అప్పగించింది. అతనికి డిప్యూటీగా మన్‌దీప్‌ సింగ్‌ వ్యవహరించనున్నారు. నవంబర్‌లో జరిగే ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్టు జట్టు కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ తెలిపారు. సీనియర్ల గైర్హాజరీలో ఆశిస్‌ టోప్నో, షంషేర్‌ సింగ్‌లు తొలి సారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.  

భారత జట్టు: హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), మన్‌దీప్‌ సింగ్‌ (వైస్‌ కెప్టెన్‌), క్రిషన్‌ బహదూర్‌ పాఠక్, సూరజ్‌ కర్కెర, గురీందర్‌ సింగ్, కొత్తాజిత్‌ సింగ్, హార్దిక్‌ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్‌ సాగర్, జస్కరణ్‌ సింగ్, గుర్‌సాహిబ్జిత్‌ సింగ్, నీలమ్‌ సంజీప్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, వరుణ్‌ కుమార్, ఆశిస్‌ టోప్నొ, ఎస్‌వీ సునీల్, గుర్జంత్‌ సింగ్, షంషేర్‌ సింగ్‌.  

మరిన్ని వార్తలు