కుర్రాళ్లతో ‘అజ్లాన్‌ షా’ టోర్నీకి భారత్‌

7 Mar, 2019 00:04 IST|Sakshi

గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం

మన్‌ప్రీత్‌ సారథ్యంలోని జట్టును ప్రకటించిన హెచ్‌ఐ

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును హాకీ ఇండియా (హెచ్‌ఐ) బుధవారం ప్రకటించింది. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కాగా 18 మంది సభ్యుల జట్టులో కుర్రాళ్లకు చోటు దక్కింది. మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. డిఫెండర్‌ సురేందర్‌ కుమార్‌కు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మలేసియాలోని ఐపోలో ఈ నెల 23 నుంచి 30 వరకు అజ్లాన్‌ షా హాకీ టోర్నీ జరుగుతుంది. భారత్, ఆతిథ్య మలేసియాతో పాటు కెనడా, కొరియా, దక్షిణాఫ్రికా, జపాన్‌ జట్లు ఇందులో తలపడతాయి.

23న భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆసియా క్రీడల చాంపియన్‌ జపాన్‌తో ఆడనుంది. అనుభవజ్ఞులైన ఫార్వర్డ్‌ ఆటగాళ్లు సునీల్, ఆకాశ్‌దీప్‌ సింగ్, రమణ్‌దీప్‌ సింగ్, లలిత్‌ ఉపా«ధ్యాయ్‌లతో పాటు డిఫెండర్లు రూపిందర్‌ పాల్‌ సింగ్, హర్మన్‌ప్రీత్‌ సింగ్, మిడ్‌ఫీల్డర్‌ చింగ్లేసన సింగ్‌లు గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యారు. వీళ్లందరికీ బెంగళూరులోని స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) సెంటర్‌లో పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌ఐ ప్రకటించింది. ఈ నెల 18న భారత హాకీ జట్టు మలేసియాకు బయల్దేరుతుంది. 

భారత హాకీ జట్టు: మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), సురేందర్‌ (వైస్‌ కెప్టెన్‌), శ్రీజేశ్‌ (గోల్‌ కీపర్‌), క్రిషన్‌ పాఠక్, గురీందర్‌ సింగ్, వరుణ్‌ కుమార్, బీరేంద్ర లక్రా, అమిత్‌ రోహిదాస్, కొతాజిత్‌ సింగ్, హార్దిక్‌ సింగ్, నీలకంఠ శర్మ, సుమీత్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్, మన్‌దీప్‌ సింగ్, సిమ్రాన్‌జిత్‌ సింగ్, గుర్జంత్‌ సింగ్, శిలానంద్‌ లక్రా, సుమిత్‌ కుమార్‌. 
 

మరిన్ని వార్తలు