సుమీత్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌

23 Jul, 2018 04:10 IST|Sakshi

రన్నరప్‌ శ్రీకృష్ణప్రియ

సాక్షి, హైదరాబాద్‌: లాగోస్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన సుమీత్‌ రెడ్డి పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. నైజీరియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి ద్వయం 21–12, 21–12తో భారత్‌కే చెందిన వైభవ్‌–ప్రకాశ్‌ రాజ్‌ జంటను ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను హైదరాబాద్‌ అమ్మాయి కె.మనీషా, మనూ అత్రితో కలిసి దక్కించుకుంది. ఫైనల్లో మనీషా–మనూ జంట 21–17, 22–20 తో కుహూ గార్గ్‌–రోహన్‌ (భారత్‌) ద్వయంపై గెలిచింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీకృష్ణప్రియ రన్నరప్‌గా నిలిచింది. మూడో సీడ్‌ సెనియా పోలికర్పోవా (ఇజ్రాయెల్‌)తో జరిగిన ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 22–20, 16–21, 25–27తో పోరాడి ఓడిపోయింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు