షరపోవా అవుట్‌

20 Jan, 2018 16:14 IST|Sakshi

మెల్‌బోర్న్‌: సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నో ఆశలతో  ఆస్ట్రేలియా గ్రాండ్‌ స్లామ్‌లో అడుగుపెట్టిన రష్యా టెన్నిస్‌ స్టార్‌ మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన మూడో రౌండ్‌ పోరులో షరపోవా 1-6, 3-6 తేడాతో జర్మనీ స్టార్‌ క‍్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ చేతిలో పరాజయం పాలైంది. ఏకపక్షంగా సాగిన పోరులో షరపోవా అంచనాలను అందుకోలేక ఓటమి పాలైంది. తొలి సెట్‌ను సునాయాసంగా కోల్పోయిన షరపోవా.. రెండో సెట్‌లో కాస్త పోరాడింది. కాగా, కెర్బర్‌ ధాటికి తలవంచిన షరపోవా టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది.

తొలి రెండు రౌండ్లలో ఆకట్టుకున్న షరపోవా.. మూడో రౌండ్‌ అడ్డంకిని మాత్రం అధిగమించలేకపోయింది. కెర్బర్‌ రూపంలో బలమైన ప్రత్యర్థి ముందు షరపోవా అనుభవం సరిపోలేదు. దాంతో వరుస సెట్లను కోల్పోయిన షరపోవా టోర్నీ నుంచి వైదొలిగింది. 2016లో  నిషేధిత ఉత్ర్పేరకాలు వాడిన కారణంగా షరపోవాపై 15 నెలల నిషేధం పడిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు