నాలుగులో రహానే..!

1 Feb, 2018 16:42 IST|Sakshi
తొలి వన్డేలో బ్యాటింగ్‌ చేస్తున్న డీకాక్‌

డర్బన్‌: ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ గురువారం టీమిండియాతో ఆరంభమైన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డు ప్లెసిస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గు చూపాడు. డర్బన్‌ మైదానం స్వతహాగా బ్యాటింగ్‌ ట్రాక్‌ కావడంతో ముందుగా డు ప్లెసిస్‌ బ్యాటింగ్‌ తీసుకునేందుకు ప్రధాన కారణం. తొలి మూడు వన్డేలకు ఏబీ డివిలియర్స్‌ దూరం కావడంతో అతని స్థానంలో మొదటి వన్డేలో మర్‌క్రామ్‌ను తుది జట్టులో తీసుకున్నారు.

నాలుగులో రహానే..

నాల్గో స్థానంలో నమ్మదగిన బ్యాట్స్‌మన్‌ అయిన అజింక్యా రహానేపైనే టీమిండియా మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపింది. మనీశ్‌పాండే పోటీలో ఉండటంతోనాలుగో స్థానంపై ప్రధానం చర్చ సాగింది. అయితే ఆ స్థానంలో రహానే కరెక్ట్‌ అని భావించిన యాజమాన్యం అతన్నే తుది జట్టులోకి తీసుకుంది. లంకతో సిరీస్‌లో రాణించిన శ్రేయస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తీక్‌ బెంచ్‌కే పరిమితం అయ్యారు.  కాగా, భారత జట్టు ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌ను జట్టులోకి తీసుకుంది.కాగా, వీరిద్దరితో కలిసి పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ కేదర్‌ జాదవ్‌ స్పిన్‌ విభాగాన్ని పంచుకోనున్నాడు.

దక్షిణాఫ్రికా తుది జట్టు:  డు ప్లెసిస్‌(కెప్టెన్‌), హషీమ్‌ ఆమ్లా, డీ కాక్‌, మర్‌క్రామ్‌, జేపీ డుమినీ, డేవిడ్‌ మిల్లర్‌, క్రిస్‌ మోరిస్‌, ఫెలూక్వాయో,  రబడా, మోర్నీ మోర్కెల్‌, ఇమ్రాన్‌ తాహీర్‌

భారత తుది జట్టు:  విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, రహానే, ఎంఎస్‌ ధోని, కేదర్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, బూమ్రా, చాహల్‌

 

మరిన్ని వార్తలు