సెరెనా, మేరీలే స్ఫూర్తి!

3 Jan, 2020 02:04 IST|Sakshi

వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ కోనేరు హంపి

విజయవాడ: అమ్మగా మారిన తర్వాత కూడా ఆటలో సత్తా చూపేందుకు బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్, టెన్నిస్‌ తార సెరెనా విలియమ్స్‌లే తనలో స్ఫూర్తి కలిగించారని ప్రపంచ మహిళల ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌ కోనేరు హంపి వెల్లడించింది. తన ఇటీవలి విజయం విశేషాలను వెల్లడిస్తూ హంపి ఈ వ్యాఖ్య చేసింది.  తల్లి అయిన తర్వాత కూడా మేరీ కోమ్, సెరెనాలు వారి వారి క్రీడాంశాల్లో విశేషంగా రాణిస్తున్నారని, వారిలా తాను కూడా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తనకిష్టమైన రంగంలో పునరాగమనం చేయాలని అనుకున్నానని హంపి అన్నారు. అయితే ప్రపంచ చాంపియన్‌ అనే బిరుదు ఇంత త్వరగా లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఇందులో తన కుటుంబం పాత్ర ఎంతో ఉందని ఆమె తెలిపింది.

‘ నేను నా పునరాగమనం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. అందుకోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నా. పాప పుట్టిన రోజే సంవత్సరం తర్వాత తిరిగి చెస్‌ ఆడాలని నిర్ణయించుకున్నా. అదే విధంగా చేశాను కూడా.’ అంటూ హంపి తన ప్రణాళిక గురించి తెలియజేసింది.  ఓవరాల్‌గా తన 2019 ఏడాది ఘనంగా గడిచిందని... క్లాసికల్‌ విభాగంలో 30 రేటింగ్‌ పాయింట్లను, ర్యాపిడ్‌ విభాగంలో 45 రేటింగ్‌ పాయింట్లను సాధించానని గర్వంగా చెప్పుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌తో ఇద్దరం బిజీ అయిపోయాం: పుజారా

పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి! 

ఐపీఎల్‌ కన్నా ప్రాణం మిన్న

సఫారీ ఆటగాళ్లంతా సేఫ్‌ 

మీ మద్దతు కావాలి

సినిమా

కరోనా పాజిటివ్‌.. 10 లక్షల డాలర్ల విరాళం!

అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్‌

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌