ఒలింపిక్స్ తర్వాత గుడ్‌బై

3 Mar, 2015 00:46 IST|Sakshi
ఒలింపిక్స్ తర్వాత గుడ్‌బై

బాక్సర్ మేరీకోమ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ అనంతరం ప్రఖ్యాత బాక్సర్ మేరీ కోమ్ తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పనుంది. 32 ఏళ్ల ఈ మణిపూర్ క్రీడాకారిణి  కొన్ని రోజులుగా ఈ విషయంపై ఆలోచిస్తున్నా తాజాగా అధికారికంగా ప్రకటించింది. '2016 ఒలింపిక్స్ తర్వాత బాక్సింగ్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. అవే నా చివరి పోటీలు. ఆ తర్వాత ఇక ఏ టోర్నీలోనూ నేను పాల్గొనదలుచుకోలేదు.

నా మూడో కుమారుడికి ఇప్పుడు రెండేళ్లు. ఇక బాక్సింగ్ చాలనిపిస్తోంది. ముగ్గురు సంతానం కలిగాక కూడా హోరాహోరీగా సాగే బౌట్‌లో ఎవరు పాల్గొంటారు? రియోలో స్వర్ణం సాధించి దేశ ప్రజలకు సంతోషం కలిగించాలని కోరుకుం టున్నాను. అందుకే ఒలింపిక్స్ వరకు కొనసాగుతా. రిటైరయ్యాక ఇంఫాల్‌లోని నా అకాడమీపైనే పూర్తిగా దృష్టి పెడతా. దీన్ని ప్రధాని మోదీతో ప్రారంభింపజేస్తాను’ అని మేరీ కోమ్ తెలిపింది.

మరిన్ని వార్తలు