మూడో టీ 20 వర్షార్పణం

13 Oct, 2017 20:48 IST|Sakshi

హైదరాబాద్:భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇక్కడ జరగాల్సిన మూడో టీ 20 రద్దయ్యింది. భారీ వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారిపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. ఈ మేరకు పలుమార్లు పిచ్ ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ రద్దుకే మొగ్గుచూపారు. ప్రధానంగా అవుట్ ఫీల్డ్ దిగబడుతూ ఉండటంతో మ్యాచ్ ఒక బంతి పడకుండానే రద్దయ్యింది. దాంతో ధనాధన్ క్రికెట్ ను చూద్దామనుకున్న నగర వాసులకు నిరాశే ఎదురైంది.చివరి ట్వంటీ 20 జరుపుదామని అంపైర్లు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. మూడు టీ 20ల సిరీస్ 1-1తో సమం అయ్యింది.

మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా రాంచీలో జరిగిన తొలి టీ 20లో టీమిండియా విజయం సాధించగా, గువాహటిలో జరిగిన రెండో టీ 20లో ఆస్ట్రేలియా విజయాన్ని సొంతం చేసుకుంది. కాకపోతే సిరీస్ నిర్ణయాత్మక రద్దు కావడంతో సిరీస్ ను ఇరు జట్లు సమంగా పంచుకున్నాయి.వన్డే సిరీస్ ను టీమిండియా 4-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు