వెర్‌స్టాపెన్‌దే బ్రెజిల్‌ గ్రాండ్‌ ప్రి

18 Nov, 2019 12:35 IST|Sakshi

బ్రాసిల్‌:  ఈ సీజన్‌ ఫార్ములావన్‌లో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ మూడో టైటిల్‌ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన బ్రెజిల్‌ గ్రాండ్‌ ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల రేసును 1 గంటీ 33 నిమిషాల  14.678 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో బ్రెజిల్‌ గ్రాండ్‌ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. క్వాలిఫయింగ్‌ రేసులో తొలిస్థానంలో నిలిచిన వెర్‌స్టాపెన్‌.. ఫైనల్‌ రేసులో కూడా అదరగొట్టాడు.

ఇక టోరో రోస్సో డ్రైవర్‌ పీర్రే గాస్లీ రెండో స్థానంలో నిలిచాడు. కాగా, ఇటీవల మెక్సికో గ్రాండ్‌ ప్రి టైటిల్‌ను గెలిచిన తర్వాత వరల్డ్‌చాంపియన్‌ షిప్‌టైటిల్‌ను గెలుచుకున్న మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌.. బ్రెజిల్‌ ఫార్ములావన్‌ రేసులో ఏడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్‌ మూడో స్థానంలో నిలవాల్సి ఉన్నప్పటికీ లైన్‌ను క్రాస్‌ చేయడంతో ఐదు పెనాల్టీ పాయింట్లు కారణంగా ఏడోస్థానానికి పడిపోయాడు.

ఇది వెర్‌స్టాపెన్‌కు ఈ సీజన్‌లో మూడో టైటిల్‌. అంతకుముందు ఆస్ట్రియా, జర్మన్‌ గ్రాండ్‌ ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. కాగా, తన కెరీర్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది ఎనిమిదో టైటిల్‌. అయితే ఈ సీజన్‌లో పోల్‌ పొజిషన్‌ను సాధించడం మాత్రం వెర్‌స్టాపెన్‌కు ఇది తొలిసారి. ఇక ఫెరారీ డ్రైవర్లు సెబాస్టియన్‌ వెటల్‌, చార్లెస్‌ లీక్లెర్క్‌ల కార్లు ఢీకొట్టుకోవడంతో ఆ ఇద్దరి అర్హత సాధించలేకపోయారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా