మ్యాక్స్‌వెల్‌ మళ్లీ వచ్చాడు

5 Feb, 2020 08:08 IST|Sakshi

మెల్‌బోర్న్‌: మానసిక సమస్యలతో క్రికెట్‌ నుంచి విరామం తీసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. దక్షణాఫ్రికాతో ఆస్ట్రేలియా ఆడే మూడు వన్డేల, మూడు టి20 సిరీస్‌లకు 14 మందితో కూడిన జట్లను క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) మంగళవారం ప్రకటించింది. మ్యాక్స్‌వెల్‌తో పాటు మరో ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్ష్‌, టెస్టుల్లో ఆడుతున్న మాథ్యూ వేడ్‌లు కూడా ఈ రెండు ఫార్మాట్‌లకు ఎంపికయ్యారు. రెండు జట్లకు కూడా ఆరోన్‌ ఫించ్‌ నాయకత్వం వహిస్తాడు. ఈ నెల 21న జరిగే తొలి టి20 పోరుతో ఆసీస్‌ సఫారీ పర్యటన మొదలవుతుంది. అనంతరం 23, 26వ తేదీల్లో మిగిలిన రెండు టి20లను...  29, మార్చి 4, 7వ తేదీల్లో మూడు వన్డేలను ఆడుతుంది.  

ఆస్ట్రేలియా వన్డే జట్టు: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, స్టీవ్‌ స్మిత్, మ్యాక్స్‌వెల్, లబూషేన్‌, మిషెల్‌ మార్ష్‌, అలెక్స్‌ క్యారీ, కమిన్స్, అగర్, హాజల్‌వుడ్, కేన్‌ రిచర్డ్సన్, స్టార్క్, వేడ్, ఆడమ్‌ జంపా.  

ఆస్ట్రేలియా టి20 జట్టు: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, స్టీవ్‌ స్మిత్, మ్యాక్స్‌వెల్, మిషెల్‌ మార్ష్‌, అలెక్స్‌ క్యారీ, కమిన్స్, అగర్, సీన్‌ అబాట్, కేన్‌ రిచర్డ్సన్, జే రిచర్డ్సన్, స్టార్క్, వేడ్, ఆడమ్‌ జంపా.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా