రిలేషన్‌షిప్‌ సీక్రెట్స్‌ చెప్పిన విని రామన్‌!

11 Apr, 2020 12:19 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన ఫార్మసిస్ట్‌ విని రామన్‌తో  ఇప్పటికే అతడి నిశ్చితార్థం జరిగింది. గత నెల 17వ తేదీన భారతీయ సాంప్రదాయంలో రెండోసారి నిశ్చితార్థం చేసుకున్నారు మ్యాక్సీ-వినీలు. అయితే గతేడాది మానసిక సమస్యలతో సతమతమైన క్షణంలో తనకు వినీ రామనే ధైర్యం చెప్పిందన్నాడు మ్యాక్సీ. ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడమని చెప్పి తన సమస్యను దూరంలో చేయడంలో కృషి చేసిన తొలి వ్యక్తి  వినీ రామనే అని చెప్పుకొచ్చాడు. (ప్రేమను వ్యక్తపరచడం అంత ఈజీ కాదు: మ్యాక్సీ)

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కాబోయే భర్త మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు వినీ రామన్‌. దానికి క్యాప్షన్‌గా ‘ప్రి ఐసోలేషన్‌’ అని రాసుకొచ్చారు. అదే సమయంలో ఎడమవైపుకు స్వైప్‌ చేస్తే తమ రిలేషన్‌షిప్‌ గురించి ఎంత చేశానో అర్థమవుతుంది అని పేర్కొన్నారు. తాము తొలిసారి ఎక్కడ కలిశాం అనే విషయం మొదలుకొని, తమలో అత్యంత కాంపిటేటివ్‌గా ఉండే వ్యక్తి ఎవరు అనే విషయాలను  షేర్‌ చేసుకున్నారు. 2013 డిసెంబర్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఈవెంట్‌లో తొలిసారి కలిశామని, తమ ప్రేమ పట్టాలెక్కడానికి నాలుగేళ్ల పట్టిందని వినీ రామన్‌ తెలిపారు. తొలుత మ్యాక్సీనే తనకు ప్రపోజ్‌ చేశాడని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఇలా అభిమానులు అడిగిన ప్రశ్నల్లో భాగంగా తమ సీక్రెట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు వినీ రామన్‌. 

pre-isolation ❤️ swipe left to see how much I contribute to this relationship... 😂

A post shared by VINI (@vini.raman) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా