మయాంక్‌ అగర్వాల్‌ అరుదైన ఘనత

29 Dec, 2018 15:53 IST|Sakshi

మెల్‌బోర్న్‌: టీమిండియా యువ క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ అరంగేట్ర టెస్టులో అదరగొట్టాడు. మయాంక్‌ ఆరంభపు టెస్టులోనే అరుదైన ఘనతను సాధించాడు. ఆసీస్‌తో ద్వైపాక్షిక​ టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగుల విలువైన పరుగులు చేసిన మయాంక్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేశాడు. ఒకవైపు భారత టాపార్డర్‌ క్యూకట్టిన సమయంలో మయాంక్‌ సమయోచితంగా ఆడి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దాంతో ఆసీస్‌ ముందు టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచకల్గింది. 

అరంగేట్ర టెస్టులో మయాంక్‌ మొత్తం 118 పరుగులు చేశాడు.  దీంతో విదేశీ గడ్డపై భారత్‌ తరపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మయాంక్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సునీల్‌ గావస్కర్‌(132) తొలి స్థానంలో ఉన్నాడు. మయాంక్‌ తర్వాతి స్థానంలో ఎల్‌ఎస్‌ రాజ్‌పుత్‌ (93) ఉన్నాడు. 

భారత్‌ విజయం రేపటికి వాయిదా!

పైన్‌ మంచి అవకాశం కోల్పోయాడు

>
మరిన్ని వార్తలు