233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..

26 Jun, 2020 15:59 IST|Sakshi

లండన్‌: దాదాపు రెండు శతాబ్దాల సుదీర్ఘ ప్రస్తానం కల్గిన క్రికెట్‌ లామేకర్‌ మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.  233 ఏళ్ల తర్వాత ఒక మహిళను ఎంసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టనుంది. ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ క్లేర్‌ కానర్‌ను ఎంసీసీ ప్రెసిడెంట్‌గా నియమించింది. అయితే ఆమె వచ్చే ఏడాది అక్టోబర్‌ 21వ తేదీన బాధ్యతలు తీసుకోనున్నారు. ఎంసీసీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరా స్థానంలో కానర్‌ను నియమించారు. (టై అంటే టై.. సూపర్‌ ఓవర్‌ ఏమిటి?)

ఎంసీసీ అనేది లండన్‌ కేంద్రగా ఏర్పడింది.  క్రికెట్‌లో చట్ట పరమైన అంశాలను చూసేందుకు దీనిని 1787 లో స్థాపించారు. కాగా, ఎంసీసీని 2005లో దుబాయ్‌ హెడ్‌ క్వార్టర్స్‌గా ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఈ క్లబ్‌కు మొదటిసారి ఒక మహిళను ఎంసీసీ అధ్యక్షురాలుగా . అయితే, క్లేర్ కానర్ ఈ పదవిలో రావటానికి ఏడాదికి పైగా వేచి ఉండాలి.  తన పదవీ కాలం వచ్చే ఏడాది ముగిసి పోనుండటంతో కుమార్ సంగక్కర స్వయంగా ఆమె నామినేషన్‌ను ప్రకటించారు.  ఇంగ్లండ్‌, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మహిళల క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్  కానర్‌ ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఎంసీసీ అధ్యక్ష పదవికి కొనార్‌ ఎంపికైనట్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వెల్లడించారు.  కాగా, దీనికి ముందు ఆమె మెర్ల్‌బోన్‌ క్రికెట్ క్లబ్ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉన్నా అది లాంఛనమే.  ('కోపం వచ్చింది.. కానీ ఏం చేయలేకపోయా')

10 ఏళ్ల పాటు సేవలు..
ఎంసీసీ అధ్యక్షురాలిగా ఎంపికైన కానర్‌ పదేళ్ల పాటు ఇంగ్లండ్‌ మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తన కెరీర్‌లో 16 టెస్టులు, 93 వన్డేలును ఆమె ఆడారు.  టెస్టుల్లో 24 వికెట్లు సాధించగా, వన్డేల్లో 80 వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. ఆమెకు రెండు అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం కూడా ఉంది. 2005లో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఆమె సారథ్యంలో ఇంగ్లండ్‌ మహిళా జట్టు తొలిసారి సిరీస్‌ను దక్కించుకుంది. దాంతో 42 ఏళ్ల చరిత్రను ఆమె లిఖించారు.  ప్రస్తుతం ఈసీబీ మహిళ క్రికెట్‌ జట్టు హెడ్‌గా కొనసాగుతున్నారు. కరోనా వైరస్‌ కారణంగా సంగక్కరా రెండో దఫా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం దక్కింది. అతని పదవీ కాలం సుమారు ఏడాది కాలం ఉండగా, కానర్‌ను ఆ స్థానంలో ఎంపిక చేయడం విశేషం. 

మరిన్ని వార్తలు