మేఘన, మనీషాలకు టైటిల్స్‌

17 Jun, 2019 14:01 IST|Sakshi

ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ ప్లేయర్స్‌ మేఘన జక్కంపూడి, మనీషా ఆకట్టుకున్నారు. విజయవాడలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో తన భాగస్వామి ధ్రువ్‌ కపిలతో కలిసి మేఘన మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను... రుతుపర్ణ (ఒడిశా)తో కలిసి మనీషా మహిళల డబుల్స్‌ టైటిల్స్‌ను హస్తగతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ ధ్రువ్‌ కపిల (ఎయిరిండియా)–మేఘన (ఆర్‌బీఐ) ద్వయం 17–21, 22–20, 21–16తో శ్లోక్‌ రామచంద్రన్‌ (ఏఏఐ)–రుతుపర్ణ పాండా (ఒడిశా) జోడీపై గెలుపొందింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో మనీషా (ఆర్‌బీఐ)–రుతుపర్ణ (ఒడిశా) జంట 23–21, 21–10తో మూడో సీడ్‌ శిఖా గౌతమ్‌ (ఎయిరిండియా)–అశ్విని భట్‌ (కర్ణాటక) జోడీపై నెగ్గి విజేతగా నిలిచింది.

పురుషుల విభాగంలో తెలంగాణ ప్లేయర్‌ సిరిల్‌ వర్మకు నిరాశ ఎదురైంది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన సిరిల్‌ వర్మ ఫైనల్లో బోల్తా పడ్డాడు. పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో ఎనిమిదో సీడ్‌ సిరిల్‌ వర్మ (తెలంగాణ) 9–21, 21–15, 11–21తో పన్నెండో సీడ్‌ కిరణ్‌ జార్జ్‌ (కేరళ) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో మూడో సీడ్‌ ఆకర్షి కశ్యప్‌ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఆకర్షి కశ్యప్‌ (ఏఏఐ) 21–12, 21–16తో ఏడో సీడ్‌ అనురా ప్రభుదేశాయ్‌ (గోవా)పై గెలుపొందింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో కృష్ణప్రసాద్‌ జంట టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుదిపోరులో టాప్‌సీడ్‌ కృష్ణ ప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌)–ధ్రువ్‌ కపిల (ఎయిరిండియా) జంట 21–19, 21–16తో మూడోసీడ్‌ అర్జున్‌ (కేరళ)–శ్లోక్‌ రామచంద్రన్‌ (ఏఏఐ) జోడీపై గెలుపొందింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీమిండియా కోచ్‌కు కొత్త నిబంధనలు!

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

‘ఇద్దరు పిల్లల తల్లి .. నాలుగు స్వర్ణాలు గెలిచింది’

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా జాఫర్‌

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ

చాంపియన్‌ కార్తీక్‌ సాయి

సింధు, శ్రీకాంత్‌లపైనే ఆశలు

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

బౌండరీలు కూడా సమానమైతే?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’