తండ్రితో సహా కోర్టుకు ఫుట్ బాల్ ప్లేయర్

3 Jun, 2016 07:57 IST|Sakshi
తండ్రితో సహా కోర్టుకు ఫుట్ బాల్ ప్లేయర్

బార్సిలోనా: అర్జెంటీనా ఫుట్ బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ కోర్టులో హాజరయ్యారు. పన్ను చెల్లింపుల్లో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలకు సంబంధించి ఆయన కోర్టుకు వచ్చారు. తన తండ్రి జోర్గ్, సోదరుడితో కలసి కెటలాన్ క్లబ్ నుంచి కారులో బార్సిలోనాలోని కోర్టుకు హాజరయ్యారు. 2007 నుంచి 2009 వరకు తన పేరిట ఉన్న ఇమేజ్ హక్కులకు సంబంధించిన ఆస్తుల విషయంలో మొత్తం 4.1 మిలియన్ డాలర్ల చెల్లించకుండా మోసం చేశారని, ఈ కేసుకు సంబంధించి 22 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పానిష్ కోర్టు చెప్పింది.

అయితే, మెస్సీ ఆయన తండ్రిపై తొలుత కోర్టులో పిటిషన్ నమోదైనప్పటికీ ఆ డబ్బు మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేందుకు మెస్సీ తండ్రి జోర్గ్ ఒప్పుకోవడంతో కేసును మూసివేయాలని కోరారు. బహుషా ఆ కేసు మూసివేతకు సంబంధించి వారు కోర్టుకు వచ్చి ఉండొచ్చని స్థానిక మీడియా చెబుతోంది. ఎందుకంటే ఈ కేసు నమోదైనప్పటి నుంచి తండ్రి కొడుకులు కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి.

>
మరిన్ని వార్తలు