సుమీత్ జంటకు మెక్సికో ఓపెన్ టైటిల్

22 Dec, 2015 02:08 IST|Sakshi
సుమీత్ జంటకు మెక్సికో ఓపెన్ టైటిల్

సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి మెక్సికో ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మెక్సికో సిటీలో భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్-మనూ అత్రి ద్వయం 22-20, 21-18తో బొదిన్ ఇసారా-నిపిత్‌ఫోన్ పువాంగ్‌పెచ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది. విజేతగా నిలిచిన సుమీత్ జోడీకి 3,950 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 61 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు