మూగబోయిన ముంబై బ్యాట్

22 Apr, 2017 22:03 IST|Sakshi
మూగబోయిన ముంబై బ్యాట్
► రాణించి బౌలర్లు, ఢిల్లీ లక్ష్యం 143 
 
ముంబై: ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ లో ముంబై టాప్ ఆర్డర్ విఫలమవడంతో వాంఖడే స్టేడియం మూగబోయింది.  కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన ముంబై టాప్ ఆర్డర్ ఢిల్లీ బౌలర్లకు తలవంచింది. టాస్ గెలిచి ఫిల్డీంగ్ ఎంచుకున్న ఢిల్లీ ,బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లకు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.  దూకుడుగా ఆడిన ఓపెనర్లు పార్దీవ్ పటేల్, జోస్ బట్లర్ ల జంటకు  తొలి మ్యాచ్ ఆడుతున్న రబడా బ్రేక్ వేశాడు. పార్థీవ్(8) ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపించాడు.
 
ఆ వెంటనే బట్లర్ ను శాంసన్ రనౌట్  చేశాడు, అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా, రోహిత్ శర్మలు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. రాణా కమిన్స్ బౌలింగ్ లో అవుటవ్వగా, రోహిత్ అమిత్ మిశ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. వీరిలో బట్లర్ (28) మినహా మిగితా బ్యాట్స్ మెన్స్ అంతా సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. ఈ తరుణంలో పోలార్డ్, కృనాల్ పాండ్యా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా, మిశ్రా మరోసారి దెబ్బకొట్టాడు. కృనాల్ పాండ్యా (17) ను పెవిలియన్ కు పంపించడంతో ముంబై 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తర్వాత హార్ధీక్ పాండ్యాతో ఆచితూచి ఆడిన పోలార్డ్ (26) ను కమిన్స్ అవుట్ చేయగా  తర్వాత క్రీజులోకి వచ్చిన హర్భజన్(2)ను రబడా రనౌట్ చేశాడు. ఆ వెంటనే హార్ధీక్ పాండ్యా (24) కేకే నాయర్ రనౌట్ చేశాడు. దీంతో ముంబై 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. మిశ్రా, కమిన్స్ లకు చెరో రెండు వికెట్లు తీయగా, రబడా ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ మూడు రనౌట్ లు అవ్వడం విశేషం.
మరిన్ని వార్తలు