భారత్‌ ఫైనల్‌ చేరింది.. ఇక మా వాళ్లే..

9 Jul, 2019 11:17 IST|Sakshi

ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌

లండన్‌ : ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే భారత్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరినట్టేనని, తమ ఆటగాళ్లే కష్టపడాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. దూకుడు మీదున్న కోహ్లిసేనను న్యూజిలాండ్‌ అడ్డుకోలేదని తెలిపాడు. భారత ఆటగాళ్ల ఫామే ఆ జట్టును హాట్‌ ఫేవరేట్‌గా చేసిందని చెప్పుకొచ్చాడు. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగే తొలి సెమీస్‌లో భారతే విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు.

సెమీస్‌ మ్యాచ్‌ నేపథ్యంలో ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. క్రికెట్‌లో ఎవరూ ఇలా ఖచ్చితంగా చెప్పరు. భారత ఆటగాడినైతే నేను కూడా ఇలా ఆలోచించను. కానీ భారత్‌ ఫామ్‌ చూస్తుంటే ఆ జట్టు కసి తెలుస్తోంది. నమ్మశక్యం కానీ ప్రదర్శనను వారు కనబరుస్తున్నారు. ఇప్పటికే వారికి ఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ బలహీనంగా కనిపిస్తోంది. వరుస ఓటములతో వారి ఆత్మవిశ్వాసం లోపించింది. ఇది వారికి కష్టాలను తేనుంది. ఇక వరుస విజయాల ఉత్సాహం భారత్‌ను ఫైనల్‌కు చేరేలా చేస్తుంది. మంచి ఊపుమీదున్న రోహిత్‌ను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. అతను, డేవిడ్‌ వార్నర్‌ టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడారు.’ అని క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు.


 


 

మరిన్ని వార్తలు