కోహ్లి ప్రపంచంలోనే ఓ చెత్త సమీక్షకుడు‌

10 Sep, 2018 09:38 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌

లండన్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రపంచంలోనే ఓ గొప్ప బ్యాట్స్‌మెన్‌.. కానీ ప్రంపంచంలోనే ఓ చెత్త రివ్యూయర్‌ కూడా అతనే అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్‌ నేపథ్యంలో వాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కోహ్లి అప్పుడే రెండు డీఆర్‌ఎస్‌(డిసిషన్‌ రివ్యూ సిస్టమ్‌)లను వృథా చేశాడు. రెండింట్లో భారత్‌కు ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. దీంతో  వాన్‌ ‘ విరాట్‌ ప్రపంచంలోనే ఓ గొప్ప బ్యాట్స్‌మన్‌. కానీ నిజమేంటంటే ప్రపంచంలోనే ఓ చెత్త రివ్యూయర్‌ కూడా అతనే’  అని ట్వీట్‌ చేశాడు.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో జడేజా వేసిన 10వ ఓవర్‌ రెండో బంతి ఆ జట్టు ఓపెనర్‌ జెన్నింగ్స్‌ ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో వెంటనే సమీక్ష కోరిన భారత కెప్టెన్‌కు నిరాశే ఎదురైంది. బంతి ఔట్‌ స్టంప్స్‌కు వెళ్లినట్లు రిప్లేలో స్పష్టం అయింది. మళ్లీ 12వ ఓవర్‌లో అదే జడేజా వేసిన బంతి కుక్‌ ప్యాడ్లకు తాకింది. మళ్లీ కోహ్లి సమీక్ష కోరి భంగపడ్డాడు. దీంతో రెండు రివ్యూలు వృథా అయ్యాయి. ఇక ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ కుదురుగా ఆడుతోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది.

చదవండి : భారత్‌- ఇంగ్లండ్‌ సిరీస్‌ ముచ్చట్లు

మరిన్ని వార్తలు