ఆసీస్‌పై మాజీ కోచ్‌ ఘాటు వ్యాఖ్యలు

29 Mar, 2018 16:08 IST|Sakshi
మికీ ఆర్ధర్‌

కరాచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆసీస్‌ క్రికెట్‌ జట్టుపై మాజీ కోచ్‌ మికీ ఆర్ధర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా ఆసీస్‌ సిగ్గుమాలిన క్రికెట్‌ ఆడుతుందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ప్రపంచ క్రికెట్‌లో అన్ని జట్లదీ ఒక దారైతే, ఆసీస్‌ది మరొకదారి అంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ట్యాంపరింగ్‌ వ్యవహారం

రోజు రోజుకూ క్రికెట్‌ సంస్కృతి ఎంతో పరిణితి సాధిస్తున‍్నప్పటికీ ఆసీస్‌ మాత్రం తన పంథాను మార్చుకోకుండా నియంతలా ప్రవర్తిస్తుందనడానికి తాజా ఘటనతో నిరూపితమైందన్నాడు. గత కొన్నేళ్లుగా ఆసీస్‌ క్రికెట్‌ ప్రవర్తన అహంకారపూరితంగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ప్రపంచ ముందు దోషిగా నిలబడిన ఆసీస్‌ క్రికెట్‌కు ఇదొక గుణపాఠంగా ఆర్ధర్‌ అభివర్ణించాడు. ట్యాంపరింగ్‌పై ఫన్నీ స్పూఫ్‌

2013లో యాషెస్‌ సిరీస్‌ తర్వాత ఆర్ధర్‌ను కోచ్‌ పదవి నుంచి తొలగించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా..ఆపై డారెన్‌ లీమన్‌కు ఆ బాధ్యతలు అప్పచెప్పింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్ధర్‌.. ప్రస్తుతం పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా పని చేస్తున్నాడు.

బయటపడ్డ మరో నిజం

మరిన్ని వార్తలు