సినిమాల్లోకి అలనాటి బాక్సర్

26 May, 2016 17:26 IST|Sakshi
సినిమాల్లోకి అలనాటి బాక్సర్

మైక్ టైసన్... ఒకప్పుడు ప్రత్యర్థి ఎవరైనా కూడా ఒక నిమిషంలోపే నాకౌట్ చేసిన ధీరుడు. 20 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్‌లోకి వచ్చి, మొదటి 19 బౌట్లలోను నాకౌట్ విజయాలు సాధించాడు. అందులో 12 మొదటి రౌండులోనే పడేశాడు. అలాంటి లెజెండరీ బాక్సర్... ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నాడు. 'కిక్‌బాక్సర్: ద రిటాలియేషన్' అనే సినిమాలో టైసన్ నటిస్తున్నాడు. ఇంకా విడుదల కావాల్సిన మార్షల్ ఆర్ట్స్ సినిమా 'కిక్ బాక్సర్: వెంజెన్స్'కు ఇది సీక్వెల్. టైసన్ సినిమా ప్రస్తుతం కాలిఫోర్నియా, నెవడాలలో షూటింగ్ జరుపుకొంటోంది. జూన్‌లో థాయ్‌లాండ్‌లో షూటింగ్ ఉంటుంది.

ఒక కేసులో దోషిగా తేలి.. జైల్లో తప్పనిసరిగా ఫైటింగ్ ప్రపంచంలోకి వెళ్లిన వ్యక్తి పాత్రను టైసన్ పోషిస్తున్నాడు. ఇప్పటికి తాము క్రీడా ప్రపంచంలో 14 మంది చాంపియన్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇప్పుడు టైసన్ రాకతో సినిమాకు కొత్త లుక్, సరికొత్త ఉత్సాహం వచ్చాయని నిర్మాత రాబర్ట్ హిక్మన్ చెప్పారు. 'కిక్‌బాక్సర్: వెంజెన్స్' సినిమాకు జాన్ స్టాక్‌వెల్ దర్శకత్వం వహించారు. 1989లో విడుదలైన 'కిక్‌బాక్సర్' సినిమాకు ఇది రీమేక్.

మరిన్ని వార్తలు