హార్దిక్‌ క్యాచ్‌.. మిల్లర్‌ ‘హాఫ్‌ సెంచరీ’

23 Sep, 2019 09:55 IST|Sakshi

బెంగళూరు: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ పాకిస్తాన్‌ సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ సరసన చేరాడు. గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంతో మిల్లర్‌ ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు మాలిక్‌ 50 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా హార్దిక్‌ క్యాచ్‌తో మిల్లర్‌ కూడా అతడి సరసన చేరాడు. మాలిక్‌ 111 టీ20ల్లో ఈ ఘనత సాధించగా.. మిల్లర్‌ కేవలం 72 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డు అందుకోవడం విశేషం. ఇక ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో మిల్లర్‌, మాలిక్‌లు ఉండగా.. డివిలియర్స్‌(44), రాస్‌ టేలర్‌(44), సురేశ్‌ రైనా(42) తరువాతి స్థానాల్లో ఉన్నారు.  

ఆదివారం టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన ఏకపక్షపోరులో కోహ్లి సేన చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో ప్రొటీస్‌ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. తొలుత బౌలింగ్‌తో అదరగొట్టిన పర్యాటక జట్టు.. అనంతరం బ్యాటింగ్‌ లోనూ చెలరేగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా దక్షిణాఫ్రికా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీనికి తోడు బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమవ్వడంతో కోహ్లి సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది. భారత ఆటగాళ్లలో శిఖర్‌ ధావన్‌(36) మినహా ఎవరూ రాణిచంలేదు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా స్వేచ్చగా బ్యాటింగ్‌ చేసింది. సారథి డికాక్‌ (79 నాటౌట్‌; 59 బంతుల్లో 6ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో దక్షిణాఫ్రికా సునాయసంగా విజయాన్ని అందుకుంది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా