సంగా.. మరో ఏడాది ఆడొచ్చుగా..

2 Apr, 2015 12:20 IST|Sakshi
సంగా.. మరో ఏడాది ఆడొచ్చుగా..

శ్రీలంక: వన్డే క్రికెట్ నుంచి నిష్క్రమించే నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించుకోవాలని శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కరకు ఆ దేశ క్రీడాశాఖ మంత్రి సూచించారు. సంగక్కర మరో ఏడాదిపాటు దేశానికి క్రికెట్ సేవను అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఓడిపోయిన అనంతరం మార్చి 18న సంగక్కర అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ ఏడాది ఆగస్టులో భారత్‌తో టెస్టు సిరీస్ తర్వాత సంగక్కర పూర్తిగా గుడ్‌బై చెప్పనున్నాడు.

ఈ నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సదరు మంత్రి విజ్ఞప్తి చేశారు. సంగక్కర వచ్చిన 2000 సంవత్సరం నుంచి శ్రీలంక క్రికెట్లో మంచిరోజులు ప్రారంభమయ్యాయని, ఇది కొట్టిపారేయలేని విషయమని చెప్పారు. ఇప్పటికే తాము సంగక్కరతో మాట్లాడామని, మరో ఏడాది దేశానికి ఆయన సేవలు అందించాలని కోరామని తెలిపారు.

మరిన్ని వార్తలు