స్వర్ణం నెగ్గిన మీరాబాయి చాను

21 Dec, 2019 03:00 IST|Sakshi
మీరాబాయి చాను

దోహ: భారత మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను ఖతర్‌ ఇంటర్నేషనల్‌ కప్‌లో సత్తా చాటింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో బరిలో దిగిన ఆమె 194 (83+111) కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. మొదట స్నాచ్‌లో 83 కేజీలు ఎత్తిన మీరా... క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 111 కేజీలను ఎత్తింది. అనైస్‌ మిచెల్‌ (ఫ్రాన్స్‌–172 కేజీలు), మనోన్‌ లోరెంజ్‌ (165 కేజీలు) వరుసగా రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో మీరాబాయి ఎత్తిన 201 కేజీల ప్రదర్శన అత్యుత్తమం కాగా... ఇక్కడ అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ సిల్వర్‌ లెవల్‌ ఈవెంట్‌ అయిన ఈ టోరీ్నలో గెలుపుతో సాధించిన పాయింట్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో మీరాబాయికి కీలకం కానున్నాయి.   

మరిన్ని వార్తలు