క్రికెటర్‌ భార్య ‘రికార్డు’ సెంచరీ!

18 Mar, 2018 18:11 IST|Sakshi
అలైస్సా హేలీ

వడోదరా:మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ భారత మహిళలతో జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళలు గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో అలైస్సా హేలీ(133) శతకం సాధించి పలు రికార్డులను నమోదు చేసింది. భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆసీస్‌ మహిళా క్రికెటర్‌గా రికార్డు సాధించడమే కాకుండా, ఆ దేశం తరపున తొలి సెంచరీ చేసిన మహిళా వికెట్‌ కీపర్‌గా హేలీ నిలిచింది. అయితే ఆసీస్‌ స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ భార్యనే అలైస్సా హేలీ.

ఒకవైపు ఆసీస్‌ పురుషుల జట్టు విజయాల్లో స్టార్క్‌ తనదైన ముద్రతో చెలరేగి పోతుంటే, మహిళా జట్టులో అతని భార్య హేలీ కూడా కీలక క్రీడాకారిణిగా మారిపోయింది. ఆదివారం జరిగిన వన్డేలో హేలీ 115 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేసింది. ఆది నుంచి భారత బౌలర్లపై పైచేయి సాధించిన హేలీ శతకంతో మెరిసింది. దాంతో ఆసీస్‌ 332 భారీ పరుగులు సాధించకల్గింది. అయితే, ఈ రికార్డుల గురించి తనకు ముందుగా తెలియదని, మ్యాచ్‌ తర్వాత సహచరులు చెబితేనే తెలిసిందని హేలీ పేర్కొం‍ది.

మరిన్ని వార్తలు