ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్‌..!

7 Feb, 2019 09:22 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : మరికొద్ది రోజుల్లో భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్‌ తలిగింది. గాయం కారణంగా ఆసీస్‌ స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ జట్టుకు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గాయపడిన స్టార్క్‌ భారత పర్యటనకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. స్టార్క్‌ స్థానంలో కనే రిచర్డ్స్‌సన్‌ జట్టులోకి వస్తాడని వెల్లడించింది. ఇంగ్లండ్‌లో జరగబోయే ప్రపంచకప్‌కు భారత పర్యటన తమ ఆటగాళ్లకు ఒక వార్మప్‌లాగా ఉపయోగపడుతుందని పేర్కొంది. మరో ఫాస్ట్‌ బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ గాయం కారణంగా ఇప్పటికే టీమ్‌కు దూరం కాగా, తాజాగా స్టార్క్‌ కూడా జట్టులో లేకపోవడంతో పర్యాటక జట్టు బౌలింగ్‌ దళం బలహీనపడనుంది. ఫిబ్రవరి 24నుంచి 13 మార్చి వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య 2 టి20 మ్యాచ్‌లు, 5 వన్డేలు జరుగనున్నాయి. 15మంది సభ్యుల జట్టును సెలెక్టర్‌ ట్రివర్‌ హోన్స్‌ ప్రకటించారు. (హైదరాబాద్‌లో వన్డే,  వైజాగ్‌లో టి20)

భారత్‌లో పర్యటించనున్న ఆసీసీ జట్టు
ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, షాన్‌ మార్ష్‌, పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఆష్టాన్‌ టర్నర్‌, మార్కస్‌ స్టొయినిస్‌, అలెక్స్‌ కారే, పాట్‌ కమిన్స్‌, నాథన్‌ కల్టర్‌ నీలే, జ్యే రిచర్డ్స్‌సన్‌, కనే రిచర్డ్స్‌సన్‌,, జాసన్‌ బహ్రెండార్ఫ్‌, నాథన్‌ లయన్‌, ఆడమ్‌ జంపా, డీయార్సీ షార్ట్‌.

మరిన్ని వార్తలు