రెండో ర్యాంక్‌లో మిథాలీ

23 Feb, 2017 10:33 IST|Sakshi
రెండో ర్యాంక్‌లో మిథాలీ

న్యూఢిల్లీ: మహిళల వన్డే క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో ఇద్దరు భారత బ్యాట్స్‌విమెన్‌ టాప్‌–10లో నిలిచారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 733 పాయింట్లతో రెండో స్థానంలో, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 574 పాయిం ట్లతో పదో స్థానంలో ఉన్నారు.

 

ఆస్ట్రేలియన్‌ ప్లేయర్‌ లానింగ్‌ 804 పాయింట్లతో మొదటి ర్యాంకులో కొనసాగుతోంది. బౌలర్ల జాబి తాలో జులన్‌ గోస్వామి మూడో స్థానంలో ఉంది. భారత లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఏక్తా బిష్త్‌ ఎనిమిదో ర్యాంకుకు చేరింది.

 

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు