‘హర్మన్‌ ప్రీత్‌ కెప్టెన్‌గా అనర్హురాలు’

24 Nov, 2018 12:36 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

దేశంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ తెచ్చిన క్రీడాకారిణి. ఇక ప్రపంచ మహిళల క్రికెట్‌లోని ఎన్నో ఘనమైన రికార్డులు ఆమె సొంతం. ప్రస్తుతం ఆమెను ఆదర్శంగా తీసుకొని క్రికెట్‌ వైపు అడుగులేస్తున్న వారు ఎందరో. అపార అనుభవం, కొత్త వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వటంలో ఫస్ట్‌, గొప్ప సారథి, గొప్ప బ్యాట్స్‌ఉమన్‌, అన్నింటికీ మించి బెస్ట్‌ గ్లేమ్‌ ప్లానర్‌ .ఇవన్నీ స్టార్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ సొంతం. అలాంటి మిథాలీకి వెస్టిండీస్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వరల్డ్‌ టీ20 సెమీఫైనల్‌లో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చోటు కల్పించలేదు. దీనిపై అభిమానులు, మాజీలు విమర్శల బాణాలు సంధిస్తున్నారు

కీలక సెమీఫైనల్‌లో అందులోనూ బలమైన ఇంగ్లండ్‌ జట్టుపై తలపడే జట్టులో అందరినీ ఆశ్చర్యపరుస్తూ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సీనియర్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌కు అవకాశం కల్పించలేదు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. మ్యాచ్‌ ఆసాంతం పరిశీలిస్తే మిథాలీ రాజ్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. పిచ్‌ల పరిస్థితులను పట్టించుకోకుండా బాదడమే లక్ష్యంగా బ్యాటింగ్‌ చేయడమే టీమిండియా ఓటమికి కారణం. ఇక మ్యాచ్‌ అనంతరం మిథాలీని పక్కకు పెట్టడంపై సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సమర్థించుకోవడంపై అభిమానుకు ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే. తాజాగా మిథాలీ మేనేజర్‌ అనీషా గుప్తా, హర్మన్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్‌ చేశారు. (మిథాలీనే పక్కన పెడతారా?)

‘బీసీసీఐ మహిళల క్రికెట్‌లో రాజకీయం లేదనుకుంటుంది. కానీ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అందరికీ అర్థమై ఉంటుంది. గ్రూప్‌ మ్యాచ్‌లో వరుసగా రెండు అర్థసెంచరీలు, ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌లు గెలుచుకున్న మిథాలీని పక్కకు పెట్టడం విడ్డూరం. గ్రూప్‌ చివరి మ్యాచ్‌కు కాస్త అనారోగ్యంగా ఉండటంతో ఆడలేకపోయింది. కానీ సెమీఫైనల్‌కు పూరి​ ఫిట్‌నెస్‌తో ఉన్నా జట్టులోకి తీసుకోలేదు. ఆసీస్‌పై ఆడిన జట్టునే కొనసాగించాలనుకోవడం హాస్యాస్పదం. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథిగా అనర్హురాలు‌, మాటలు మార్చడం, అబద్దాలు చెప్పడం ఆమెకు అలవాటు. అమెకు అంతగా అనుభవం కూడా లేదు’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.  వైరల్‌ కావడంతో అనీషా గుప్తా ట్వీట్‌ను తొలగించారు.   (రోహిత్‌ రికార్డు బ్రేక్‌ చేసిన మిథాలీ)

అర్థం చేసుకున్నందుకు సంతోషం : మిథాలీ

>
మరిన్ని వార్తలు