మిథాలీ రాజ్‌కే పగ్గాలు

14 Jan, 2014 00:56 IST|Sakshi
మిథాలీ రాజ్‌కే పగ్గాలు

 సాక్షి, హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు నాయకురాలిగా హైదరాబాదీ మిథాలీ రాజ్ మరోసారి బాధ్యతలు చేపట్టనుంది. శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌ల కోసం భారత కెప్టెన్‌గా మిథాలీని సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. గత ఏడాది సొంతగడ్డపై బంగ్లాదేశ్‌లో జరిగిన వన్డే, టి20లలో జూనియర్ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు మిథాలీకి విశ్రాంతినిచ్చారు.
 
 ఆ సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించింది. వన్డే జట్టులో హైదరాబాద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానాకు స్థానం లభించగా... శ్రీలంకతో వార్మప్ మ్యాచ్ ఆడే ఇండియా ‘ఎ’ టీమ్‌లో హైదరాబాద్ నుంచి స్నేహ మోరె, ఆంధ్ర క్రికెటర్ ఎస్.మేఘన ఉన్నారు. ఈ సిరీస్‌కు పూర్తిగా ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ఆతిథ్యమివ్వనుంది. 3 వన్డేలు, 1 టి20 మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కాగా... 2 టి20 మ్యాచ్‌లు విజయనగరంలో కొత్తగా నిర్మించిన మైదానంలో జరగనున్నాయి. ఈ నెల 19నుంచి 28 వరకు సిరీస్ జరుగుతుంది.
 
 జట్ల వివరాలు
 వన్డే: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), కరుణ జైన్, అనఘా దేశ్‌పాండే, స్మృతి, పూనమ్ రౌత్, అమితా శర్మ, స్నేహ రాణా, వనిత వీఆర్,  జులన్ గోస్వామి, నిరంజన నాగరాజన్, శుభలక్ష్మి శర్మ, గౌహర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
 టి20: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), కరుణ జైన్, స్మృతి, పూనమ్ రౌత్, అమితా శర్మ, జులన్ గోస్వామి, నిరంజన నాగరాజన్, శుభలక్ష్మి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, వేదా కృష్ణమూర్తి, ఏక్తా బిస్త్, సోనియా దబీర్, అనఘా దేశ్‌పాండే, వనిత వీఆర్.
 

>
మరిన్ని వార్తలు