మిథాలీ ఒంటరి పోరాటం

4 Dec, 2016 13:02 IST|Sakshi
మిథాలీ ఒంటరి పోరాటం

బ్యాంకాక్: మహిళల ఆసియాకప్ ట్వంటీ 20టోర్నీలో భాగంగా పాకిస్తాన్ తో ఇక్కడ ఆదివారం జరిగిన తుది పోరులో భారత ఓపెనర్ మిథాలీ రాజ్( 73 నాటౌట్;65 బంతుల్లో 7 ఫోర్లు1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. మిగతా భారత క్రీడాకారిణులు విఫలమైనా మిథాలీ చివరి వరకూ క్రీజ్లో నిలబడింది. దాంతో భారత్ జట్టు 122 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించకల్గింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే మందనా(6)వికెట్ ను నష్టపోయింది. అనంతరం మేఘనా(9), వేదా కృష్ణమూర్తి(2), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5)లు ఘోరంగా విఫలమయ్యారు. కాగా, మిథాలీకి జులాన్ గోస్వామి(17) కొద్దిపాటి సహకారం అందించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. పాక్ మహిళల్లో ఆనమ్ అమిన్ రెండు వికెట్లు తీయగా, సానా మిర్, సదియా యూసఫ్లకు తలో వికెట్ దక్కింది.

>
మరిన్ని వార్తలు