నాకు సక్లయిన్ కావలె!

10 Aug, 2017 13:50 IST|Sakshi
నాకు సక్లయిన్ కావలె!

లండన్: ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను ఇంగ్లండ్ 3-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ సిరీస్ విజయంలో ఆల్ రౌండర్ మొయిన్ అలీ కీలక పాత్ర పోషించాడు. 250కిపైగా పరుగులు, 25 వికెట్లతో సిరీస్ ఆద్యంతం రాణించి సత్తాచాటుకున్నాడు. మరొకవైపు నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో 250పైగా పరుగులు, 25 వికెట్లు సాధించిన తొలి టెస్టు క్రికెటర్ గా మొయిన్ అలీ గుర్తింపు పొందాడు. అయితే తన స్పిన్ బౌలింగ్ క్రమేపి మెరుగుపడటానికి ఇంగ్లండ్ జట్టుకు స్పిన్న్ కన్సల్టెంట్ గా పని చేస్తున్న పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ కారణమని మొయిన్ భావిస్తున్నాడు. ఆ దిగ్గజ బౌలర్ని పూర్తిస్థాయి స్పిన్ బౌలింగ్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందని మొయిన్ ఇంగ్లండ్ క్రికెట్ పెద్దలను కోరుతున్నాడు.

 

'సక్లయిన్ తో కలిసి పని చేయడం చాలా బాగుంది. నా స్పిన్ బౌలింగ్ ను మెరుగుదలలో సక్లయిన్ అమూల్యమైన సలహాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అతన్ని తాత్కాలిక స్పిన్ సలహాదారుగా కాకుండా పూర్తి స్థాయి స్పిన్ బౌలింగ్ కోచ్ బాధ్యతల్ని అప్పగించండి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లు ఉన్నప్పుడు స్పిన్ బౌలింగ్ కోచ్ ఉంటే తప్పేమిటి. యాషెస్ సిరీస్ కు కొన్ని ప్రణాళికలున్నాయి. ఆ సమయంలో సక్లయిన్ నా పక్కనే ఉంటాడని అనుకుంటున్నా'అని మొయిన్ అలీ పేర్కొన్నాడు.

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు