ఆమిర్కు లైన్క్లియర్

7 Jan, 2016 16:03 IST|Sakshi
ఆమిర్కు లైన్క్లియర్

వెల్లింగ్టన్:స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నమొహమద్ ఆమిర్ న్యూజిలాండ్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. ఇటీవల పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న ఆమిర్ కు న్యూజిలాండ్ దేశం నుంచి వీసా లభించే విషయంలో తొలుత కొంత సందిగ్థత ఏర్పడింది. అయితే న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎట్టకేలకు అతనికి వీసా మంజూరు చేశారు. దీంతో 23 ఏళ్ల ఆమిర్ న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరే పాక్ జట్టుతో కలిసి విమానం ఎక్కనున్నాడు.
 

న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ తలపడే వన్డే, టి20 పాకిస్తాన్ జట్లలో ఆమిర్ కు  స్థానం లభించిన సంగతి తెలిసిందే. ఆమిర్ పునరాగమనంపై అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చినా... అతనికి గట్టిగా మద్దతు పలికిన పాక్ బోర్డు, ఇటీవలి ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ఎంపికపై తమ వాదనను సమర్థించుకుంది. 2010లో లార్డ్స్ టెస్టులో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆమిర్ ఐదేళ్ల నిషేధం ఎదుర్కొనడంతో పాటు ఆరు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇటీవల సెప్టెంబర్‌లో అతడిపై నిషేధం ముగియడంతో పాక్ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లోనూ రాణించాడు.

మరిన్ని వార్తలు