పాక్‌ బౌలర్‌కు ఐసీసీ ఊరట

2 May, 2018 17:58 IST|Sakshi
మహ్మద్‌ హఫీజ్‌

దుబాయ్‌ : నిబందనలకు విరుద్దంగా ఉన్న బౌలింగ్‌ యాక్షన్‌తో నిషేదం ఎదుర్కుంటున్న పాకిస్తాన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌,ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ హఫీజ్‌కు ఊరట లభించింది. బౌలింగ్‌ యాక‌్షన్‌ మార్చుకున్న హఫీజ్‌పై ఐసీసీ తాజాగా నిషేదం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. నిబందనలకు విరుద్దంగా బౌలింగ్‌ చేస్తున్నాడని ఈ పాక్‌ స్పిన్నర్‌పై ఐసీసీ గతంలో మూడు సార్లు నిషేదం విధించిన విషయం తెలిసిందే. హఫీజ్‌ బంతులను వేసే సమయంలో తన మోచేతిని 15 డిగ్రీలకన్నా ఎక్కువగా వంచుతున్నాడని ఇది ఐసీసీ బౌలింగ్‌ నిబంధనలకు విరుద్దమని అతనిపై చర్యలు తీసుకుంది.

తాజాగా తన బౌలింగ్‌ శైలిని మార్చుకున్న హఫీజ్‌ ఇటీవల ఐసీసీ ముందు హాజరయ్యాడు. అతని బౌలింగ్‌ యాక‌్షన్‌ను పరీక్షించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ నిషేదం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. హఫీజ్‌ తన బౌలింగ్‌ యాక్షన్‌ను భవిష్యత్తులో​ మార్చడని అధికారులు విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనికి హఫీజ్‌ తాజా బౌలింగ్‌ యాక‌్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం జోడించింది.

మరిన్ని వార్తలు