బంగ్లాను గెలిపించిన కైస్, దాస్‌

26 Oct, 2018 05:36 IST|Sakshi

చిట్టగాంగ్‌: ఓపెనర్లు ఇమ్రూల్‌ కైస్‌ (90; 7 ఫోర్లు), లిటన్‌ దాస్‌ (83; 12 ఫోర్లు, 1 సిక్స్‌)  రాణించడంతో బంగ్లాదేశ్‌ రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలిచింది. మరో వన్డే మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట జింబాబ్వే 50 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. బ్రెండన్‌ టేలర్‌ (75; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు. విలియమ్స్‌ (47; 2 ఫోర్లు), సికందర్‌ రజా (49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తర్వాత లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ 44.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. నేడు చివరి వన్డే జరుగుతుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు