షమీ ‘పేద్ద’ క్రికెటర్‌లా ఫీలవుతాడు: భార్య

3 Sep, 2019 17:09 IST|Sakshi

కోల్‌కత : టీమిండియా పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. అతని భార్య హసీన్‌ జహాన్‌ దాఖలు చేసిన గృహహింస పిటిషన్‌పై విచారణ చేపట్టిన అలీపూర్‌ కోర్టు షమీతో పాటు ఆయన సోదరుడు హసీద్‌ అహ్మద్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది.  ఈ నేపథ్యంలో హసీన్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు. ఏడాది కాలంగా న్యాయం కోసం వేచిచూస్తున్నా. ఎట్టకేలకు మంచి నిర్ణయం వెలువడింది.
(చదవండి : షమీపై అరెస్ట్‌ వారెంట్‌)

తనంత బలవంతుడు లేడన్నట్టుగా షమీ మితిమీరి ప్రవర్తిస్తాడు. తానో పేద్ద క్రికెటర్‌లా ఫీలవుతాడు. నేను బెంగాల్‌కు చెందినదాన్ని కాకున్నా.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాకుండా వేరే ఎవరున్నా నేను క్షేమంగా ఉండేదాన్ని కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నప్పుడు అమ్రోహ పోలీసులు నన్నూ, నా కూతుర్ని వేధింపులకు గురిచేశారు. దేవుని దయవల్ల అక్కడ నుంచి క్షేమంగా బయటపడ్డాం’ అన్నారు. ఇక జసీన్‌ ఫిర్యాదు మేరకు షమీపై మార్చిలో వరకట్నం, లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. నెలకు రూ.7 లక్షలు భరణంగా ఇవ్వాలని జసీన్‌ డిమాండ్‌ చేసింది. వీరి వివాహం 2014లో జరిగింది.

మరిన్ని వార్తలు