'మూడో పెళ్లి చేసుకోలేదు'

22 Dec, 2015 09:31 IST|Sakshi
'మూడో పెళ్లి చేసుకోలేదు'

హైదరాబాద్: తనపై వస్తున్న వదంతులకు పుల్స్టాప్ పెట్టేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్. ఈ క్రికెటర్ మరో వివాహం చేసుకున్నాడని ఇటీవల వదంతులు షికార్లు చేస్తున్నాయి. కొన్ని మీడియాలలో వార్తలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విసుగుచెందిన అజహరుద్దీన్ ఈ విషయంపై ట్విట్టర్ పోస్ట్ ద్వారా సమాధానమిచ్చాడు. స్నేహితురాలు షాన్నన్ మేరీని ఈ క్రికెటర్ పెళ్లి చేసుకున్నాడని ఊహాగనాలు వినిపించగా, తాను మూడో వివాహం చేసుకోలేదని ఆ వార్తలను ఖండించాడు.

 

ఇదిలాఉండగా, తన డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించడానికి శనివారం ముంబైకి వెళ్లినపుడు షాన్నెన్ ను ఆయన తన భార్యగా పరిచయం చేశాడన్నది వదంతులకు ఊతమిచ్చింది. ఇటీవల జరుగుతున్న ఐటీపీఎల్ లీగ్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఏసెస్, ఫిలిప్పైన్స్ మ్యాచ్ వీక్షించడానికి గర్ల్ ఫ్రెండ్ షాన్నెన్తో కలిసి వచ్చిన విషయం అందరికీ విదితమే.

టీమిండియా విజయవంతమైన క్రికెట్ కెప్టెన్లలో ఒకడుగా పేరుగాంచిన అజహర్ మొదటి భార్య నౌరీన్తో 1996లో విడాకులు తీసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా, రెండో భార్య సంగీతా బిజ్లానీ, అజహర్ 2010లో విడిపోయారు. షాన్నెన్తో సన్నిహితంగా ఉండటంతో తాను వివాహం చేసుకున్నట్లు అందరు భావించినట్లు చెప్పాడు. అయితే తాను మూడో వివాహం చేసుకున్నాడన్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ తప్పుడు కథనాలు అని మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కొట్టిపారేశాడు.

మరిన్ని వార్తలు