కివీస్‌తో వన్డే: మహ్మద్‌ షమీ ‘సెంచరీ’

23 Jan, 2019 08:20 IST|Sakshi

నేపియర్‌ : టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో షమీ వికెట్ల సెంచరీ సాధించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌ను షమీ గట్టి దెబ్బతీశాడు. ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌(5), కొలిన్‌ మున్రో(8)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చి షమీ 100 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. తద్వార అంతర్జాతీయ వన్డేల్లో అతి వేగంగా 100 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. 56 వన్డేల్లో ఈ ఘనతను అందుకొని ఇప్పటి వరకు ఇర్ఫాన్‌ పఠాన్‌ (59 వన్డేలు ) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. భారత మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ 65 వన్డేల్లో ఈ ఘనతను అందుకోగా.. అజిత్‌ అగార్కర్‌ 67 వన్డేల్లో, జవగల్‌ శ్రీనాథ్‌ (68 వన్డేల్లో  100 వికెట్ల మార్క్‌ను అందుకున్నారు.


 

>
మరిన్ని వార్తలు