‘రవి భాయ్‌.. బిర్యానీ పంపించా తీసుకోండి’

26 May, 2020 10:22 IST|Sakshi

హైదరాబాద్‌: ముస్లింలు పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎవరి ఇంట్లో వారే ప్రార్థనలు చేసుకున్నారు. ఇక రంజాన్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది హలీమ్‌, బిర్యానీ, సేమియా పాయసం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం సోదరులు తమ ఆత్మీయులను ఇంటికి పిలిచి రంజాన్‌ ప్రత్యేక వంటకాలను వడ్డించే వీలులేకుండా పోయింది. అయితే టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ తన ఆత్మీయులకు కోసం వినూత్నంగా ఆలోచించాడు. 

మటన్‌ బిర్యానీ, సేమియా పాయసం, డెజర్ట్స్‌ను టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి షమీ ప్రత్యేకంగా పంపించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో పేర్కొంటూ, తను పంపించిన ఫుడ్‌ ఐటమ్స్‌కు సంబంధించిన ఫోటోను కూడా జత చేశాడు. ‘రవి భాయ్.. సేమియా పాయసం, మటన్ బిర్యానీ, డెజర్ట్స్‌లను ప్యాక్ చేసి పంపించాను. కొద్దిసేపట్లో మీ దగ్గరికి వస్తుంది. స్వీకరించండి’ అంటూ షమీ ట్వీట్‌ చేశాడు. అంతకుముందు తన అభిమానులకు, సహచర క్రికెటర్లకు సోషల్ మీడియా వేదికగా ఈద్ శుభాకాంక్షలు తెలిపాడు.చదవండి:
ఐపీఎల్‌-2020 విజేత ఆర్సీబీ: సంబరంలో ఫ్యాన్స్‌
హెరాయిన్‌తో పట్టుబడ్డ క్రికెటర్

మరిన్ని వార్తలు