నా ఆట అప్పుడు మొదలవుతుంది!

20 Jun, 2020 03:05 IST|Sakshi

రెండో ఇన్నింగ్స్‌ ప్రదర్శనపై షమీ

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా భారత జట్టు టెస్టు విజయాల్లో పేస్‌ బౌలర్‌ షమీ కూడా కీలకపాత్ర పోషించాడు. అయితే సహచర పేసర్లతో పోలిస్తే తొలి ఇన్నింగ్స్‌లోకంటే షమీ రెండో ఇన్నింగ్స్‌ రికార్డు చాలా బాగుంది. తన కెరీర్‌లో పడగొట్టిన మొత్తం 180 వికెట్లలో షమీ తొలి ఇన్నింగ్స్‌లో 32.50 సగటుతో 92 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసిన సందర్భంలో కేవలం 21.98 సగటుతో 88 వికెట్లు తీశాడు.  మ్యాచ్‌ సాగినకొద్దీ అతని బౌలింగ్‌లో పదును పెరిగినట్లు కనిపిస్తుంది. దీనిపై షమీ మాట్లాడుతూ... ‘ఇతర బౌలర్లు అలసిపోయిన సందర్భంలో బాధ్యత తీసుకుంటాను. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోతాను. జట్టులో ప్రతీ ఒక్కరు అప్పటికే కనీసం మూడు రోజులు మైదానంలో గడుపుతారు. డీజిల్‌ ఇంజిన్లతో పోలిస్తే పెట్రోల్‌ ఇంజిన్‌ తొందరగా పికప్‌ అందుకుంటుంది. నాదైన సమయం కోసం వేచి చూస్తాను. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ దానికి మంచి ఉదాహరణ. పిచ్‌లో జీవం, బౌన్స్‌ లేకున్నా అలాంటి చోట రెండో ఇన్నింగ్స్‌లో నేను ఐదు వికెట్లు తీశాను’ అని షమీ విశ్లేషించాడు.

మరిన్ని వార్తలు